వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ

వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ

తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య

రామన్నపేట అక్షిత ప్రతినిధి

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి ఆ ఇంటి వెలుగు అన్న పెద్దల మాటను అక్షరాలా నిజం చేసింది ఆ యువతి. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల దివ్య , వైద్య విద్య లో అద్భుత ప్రతిభకనబరిచి ఎంబిబిఎస్ పట్ట అందుకుంది. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ సైన్సెస్ కాన్వొకేషన్ లో విసి డాక్టర్ కే రమేష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ ల చేతుల మీదుగా ఆమె ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. పీ జీ పూర్తి చేసి, సామాన్యులకు వైద్యం అందిస్తాను. అదే తల్లిదండ్రుల, మా మామయ్య ల ఆశయం. డాక్టర్ ముత్యాల దివ్య అన్నారు.ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ ముత్యాల దివ్య ని అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking