ఎస్ ఎస్ సి ఫలితాలలో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం..

ఎస్ ఎస్ సి ఫలితాలలో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం..

రామన్నపేట అక్షిత ప్రతినిధి

స్ ఎస్ సి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాల విద్యార్థులు 34 మంది పరీక్షలకు హాజరుకాగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. అప్పం సహస్ర 567/600 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, రింషా సదాఫ్ 565/600 మార్కులతో ద్వితీయ స్థానంలో, ఎస్. ప్రణతి 560/600 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరై 35 మందిలో 21 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.మణి, ఉపాద్యాయులు రషీద్,మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీమ్, సత్తయ్య ఇతర ఉపాద్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking