సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ తప్పనిసరి.. 

సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ తప్పనిసరి.. 

ఈ నిబంధన ఎప్పుడు మారిందంటే..

హైదరాబాద్ అక్షిత బ్యూరో 

ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఒకప్పుడు భారతదేశంలో సైకిల్ నడపాలంటే కూడా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. సాధారణంగా మోటారు వాహనాలకు మాత్రమే లైసెన్స్ అవసరం అనుకుంటాం కానీ, బ్రిటిష్ పాలనలో సైకిళ్లకు కూడా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఉండేది. 1970ల వరకు ఈ నిబంధన అమల్లో ఉండేది. ఎందుకంటే అప్పట్లో సైకిల్ అనేది ఓ విలాసవంతమైన వాహనం. చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే సైకిల్ ఉండేది (Bicycle license India history).బ్రిటిష్ పాలనా కాలంలో, స్థానిక మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు సైకిళ్లకు లైసెన్స్‌లు జారీ చేసేవి. ఈ లైసెన్స్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే పని చేస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త లైసెన్స్ తీసుకోవాలి. ఏడాదికి ఒకసారి రెండు రూపాయలు చెల్లించి సైకిల్ కోసం లైసెన్స్ తీసుకునేవారు. డబ్బు జమ చేసిన తర్వాత, ఇత్తడితో చేసిన ఒక చిన్న ట్యాగ్ లభించేది. దానిని సైకిల్ ఫ్రేమ్‌కు తగిలించాలి. ఆ ట్యాగ్ లేకుండా సైకిల్ తొక్కితే జరిమానా చెల్లించాల్సిందే. (Cycling license India old rule).రెండు రూపాయల లైసెన్స్ ఫీజు అనేది ప్రస్తుతం చాలా తక్కువగా అనిపించొచ్చు. కానీ, ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. ఇక, రాత్రి చీకటిలో సైకిల్‌పై వెళ్లేటపుడు లాంతరు లేదా లైటు ఉండటం తప్పనిసరి. లేకపోతే లైసెన్స్ రద్దు చేసేవారట. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్‌లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేవారట. ఇంటికి కొత్త సైకిల్ రాగానే, ముందుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ కోసం లైన్‌లో నిలబడాల్సి వచ్చేదట (Rs.2 bicycle fee India).ఆ సమయంలో, సైకిళ్లను ఒక విలాస వస్తువుగా పరిగణించేవారు (Cycling law India history). ప్రభుత్వం వాటిపై పన్ను విధించి ఆదాయం సంపాదించేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ నిబంధన చాలా కాలం వరకు మారలేదు. అయితే 1970లలో మోటారు వాహనాల చట్టం ఆమోదం పొందిన తర్వాత, సైకిళ్లకు లైసెన్స్ విధానం రద్దయింది. ఆ తర్వాత పేద వాళ్లకు కూడా సైకిళ్లు అందుబాటులోకి వచ్చేశాయి.🙏

 

Leave A Reply

Your email address will not be published.

Breaking