లాభాల కోసమే కృత్రిమ కొరత: జాన్‌వెస్లీ
హైదరాబాద్ అక్షిత బ్యూరో
లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. ఓ వైపు దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటూనే కొరత సృష్టించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. ఆయిల్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అన్ని పెట్రోల్ బంకుల్లో పూర్థిస్థాయిలో ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.