శ్మశానంలోనే వారం రోజులుగా మృతుని ఫ్యామిలీ..

శ్మశానంలోనే వారం రోజులుగా మృతుని ఫ్యామిలీ..

మంటగలిసిన మానవత్వం, సిగ్గు సిగ్గు

హైదరాబాద్ అక్షిత బ్యూరో 

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు కనుమరుగవుతోంది. సాటి మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు ఈర్శ్య, ద్వేషాలతో దూరం పెట్టడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకుంటే ఆతని కుటుంబం పుట్టెడు దుఖఃలో ఉంటే ఆదరించి ఓదార్చాల్సిన ఇరుగు,పొరుగు వాళ్లను దూరం పెట్టడం అత్యంత హేయమైన సంఘటనగా నిలిచింది. కరీంనగర్ జిల్లా చింతకుంట గాంధీనగర్‌లో విషాదం నిండిన వేళ ఇంటి యజమాని అమానుషంగా వ్యవహరించారు. శ్రీకాంత్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ సప్తగిరి కాలనీ సమీపంలోని శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శ్రీకాంత్ మరణానంతరం కూడా అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీకాంత్ తల్లిని ఇంటి యజమాని ఇంట్లోకి రావడానికి అనుమతివ్వకపోవడంతో స్మశానంలోనే గత 7రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking