పొంగులేటికి మద్దతుగా పలువురు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా

పొంగులేటికి మద్దతుగా పలువురు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా

పినపాక అక్షిత ప్రతినిధి

పినపాక మండలానికి చెందిన పొంగులేటి వర్గీయులు గురువారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను ఎటువంటి నోటీసులు అందించకుండా సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అందుకుగాను మండలంలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పొంగులేటి ,పాయం అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు నడుస్తామని ప్రకటించారు. పొట్లపల్లి ఉపసర్పంచ్ కస్తూరి లింగయ్య, వార్డు నెంబర్లు తోలం కృష్ణ, బడే కృష్ణ, బడే కిషోర్, అనిల్, ఉప్పాక వార్డు నెంబర్ నవాతి శ్రీను, మాజీ మార్కెట్ డైరెక్టర్ కొమరం రాములు, మాజీ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉడుముల లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల మాజీ కార్యదర్శి పేరం వెంకటేశ్వరరావు, మల్లారం మాజీ ఉపసర్పంచ్ పోలిపోయిన రామనాథం, మాజీ ఉపసర్పంచ్ తోలేం అర్జున్, కమిటీ మెంబర్ తాళ్లగుట్టయ్య, బడే రామన్న, పడిగా నరసింహారావు, బిక్క నరసింహారావు, రవి నరేందర్, ఉడుముల రవీందర్ రెడ్డి, సమ్మయ్య, అనిల్, అబ్బయ్య, ఆర్య నాగభూషణం, సర్ప అనంత రావు, సీతయ్య, లోడిగ ముత్తయ్య, కస్తూరి చంద్రయ్య అనంతరావు లక్ష్మణరావు, సంజీవ, ఆనందరావు, శ్రీను,నరసింహరావు, లింగమ్మ ,సుశీల, ఎస్.కె చిన్న మదర్, తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలియజేశారు. పొంగిలేటి వెంటే తమ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking