అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ బైక్ ర్యాలీని జయప్రదం చేయండి

అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ బైక్ ర్యాలీని జయప్రదం చేయండి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట మండల అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీలో అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ రామన్నపేట రహదారి బంగ్లాలో ఉత్సవ కమిటీ సభ్యుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ మండల కన్వీనర్ నాగటి ఉపేందర్ కో- కన్వీనర్ సుక్క శ్రవణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో బహుజన సబ్బండవర్గాల ప్రజానీకం ఈ ఉత్సవాల ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పట్టణ కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీకి ప్రజలు అంబేద్కర్ అభిమానులు,స్వచ్ఛందగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు
ఈ సమావేశంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మండల ప్రధాన బాధ్యులు కక్కిరేణిణి విజయ్, నోముల అశోక్, గాదె నరేందర్, వేముల సైదులు, నోముల చిరంజీవి, నకిరేకంటి నరసింహ, బల్గూరి అంజయ్య, పెరుమాండ్ల నవీన్,నోముల యాదగిరి,విష్ణు,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking