వైద్యాధికారి ఝాన్సీని విధుల నుండి తొలగించాలి ఆర్టిహెచ్ఎఫ్ అధ్యక్షులు రాజలింగు మోతె

వైద్యాధికారి ఝాన్సీని విధుల నుండి తొలగించాలి

ఆర్టిహెచ్ఎఫ్ అధ్యక్షులు రాజలింగు మోతె

మంచిర్యాల, అక్షిత బ్యూరో:

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఝాన్సీని విధుల నుండి తొలగించాలని రైట్ టు హెల్త్ ఫోరమ్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. నెన్నెల పీహెచ్సిలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే ఉద్యోగిని పదే పదే అందరి ముందు అవమానించడంతో మనోవేదనకు గురై బాత్రూం క్లీన్ చేయడానికి ఉపయోగించే హార్ఫిక్ త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు కారకురాలైన నెన్నెల మండల వైద్యాధికారిని విధుల నుంచి తొలగించాలని, కిరణ్ కుమార్ ఇంట్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైటు హెల్త్ ఫోరం నాయకులు ఆవుల రమేష్, సిద్ధంకి శ్రీనివాస్, సానగొండ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking