తేజశ్వినినగర్ లో అత్తాపూర్ కార్పొరేటర్ సమస్యలు తెలుసుకునేందుకు పర్యటన.

తేజశ్వినినగర్ లో అత్తాపూర్ కార్పొరేటర్ సమస్యలు తెలుసుకునేందుకు పర్యటన.

రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి:

అత్తాపూర్ డివిజన్ బస్తీ పర్యటనలో భాగంగా అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీ శంకర్ అధికారులతో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు  తేజస్వి నగర్ కాలనీలో పర్యటించసారు. అధికారులతో కలసి  కాలనీ ఏర్పడి  ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా సిసి రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు,ఇతర  సమస్య అలాగే ఉన్నాయని ప్రజలు తమ కాలనిలో సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు కార్పొరేటర్ సంగీతకు అలాగే అధికారులకు వివరించారు.అందుకు స్పందించిన కార్పొరేటర్ సంగీత తమ దృష్టికొచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. బస్తీలో అనేక సమస్యలు పలుమార్లు  అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదని వాపోయారు.సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్నందున  కార్పొరేటర్ మాట్లాడుతూ సమస్యకు లోపం ఎక్కడ ఉందో వీలైనంత తొందరలో బస్తీ ప్రజల సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రాములు, జిహెచ్ఎంసి సిబ్బంది నరహరి రాజు, బుచ్చిరెడ్డి, హెచ్ఎం డబ్ల్యు ఎస్ కార్మికులు చెన్నయ్య, ఎంటమాలజి సిబ్బంది పోలీసు సిబ్బంది ఎస్ఎస్ కృష్ణ కిషోర్, జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు బస్తీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking