హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
పీజేఆర్ స్టేడియంలో చలి వేంద్రం ప్రారంభం..
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో గురువారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి బీఎస్ ఎన్ ల్ ఏరియా మాజీ జనరల్ మేనేజర్ రవికుమార్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా హోఫ్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పలు ప్రజా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు, ప్రతి ఏటా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్, గంగారాం, హుడా కాలనీ, లింగంపల్లి, తారనగర్, నల్లగండ్ల మొదలగు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ రోజు చందానగర్ పీజేఆర్ స్టేడియంలో హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించినట్లు హోప్ ఛైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు మారం వెంకట్, ప్రసాద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.