అందరం కలిసి దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

అందరం కలిసి దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పునికిపుచ్చుకొని, అందరం కలిసికట్టుగా ఉండి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సింగరేణి ఏరియా వర్క్ షాప్ యాక్టింగ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఏరియా వర్క్ షాప్ లో ఏఐటీయూసి, ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ముందస్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్క్ షాప్ యాక్టింగ్ డివైజిఏం కృష్ణారెడ్డి, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు రేగుండ చంద్రశేఖర్, బిసి సంక్షేమ సంఘం నాయకులు ముల్కల వెంకటేశ్వర్లు, ఎస్సి, ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ ఫిట్ కార్యదర్శి వై శ్రీనివాస్, ఏఐటీయూసి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, టిబిజీకేఎస్ ఫిట్ కార్యదర్శి కొండలరావు, అంబేద్కర్ వాది, రచయిత గొడిసెల శ్రీహరి తదితరులు పాల్గొని, ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. కార్మిక చట్టాలను, హక్కులను కాపాడుకునే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. 8 గంటల పని విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడని, ఆయన స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఇంజనీర్లు శ్రీనివాస్, సత్య గౌడ్, నాగుల శ్రీనివాస్, పిఏ సంతోష్, ఏఐటీయూసి నాయకులు పెద్దపల్లి బానయ్య, పారిపెల్లి రాజేశం, టిబిజీకేఎస్ నాయకులు తోట రాజిరెడ్డి, ఇప్ప సమ్మయ్య, ఐఎన్టియుసి ఫిట్ కార్యదర్శి కళ్యాణ్, సిఐటియు ఫిట్ కార్యదర్శి భేతి భరత్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ తోట వెంకటస్వామి, లక్ష్మణ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking