కవ్వగుడా,మల్కారం గ్రామాల్లో పల్లె పల్లెకు ఓబీసీ,ఇంటింటికి బిజెపి ప్రారంభం.

కవ్వగుడా,మల్కారం గ్రామాల్లో పల్లె పల్లెకు ఓబీసీ,ఇంటింటికి బిజెపి ప్రారంభం.
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి: రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ, మల్కారం గ్రామాలలో ఓబీసీ శంషాబాద్ మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు ఆధ్వర్యంలో పల్లె పల్లెకు ఓబీసీ – ఇంటింటికి బిజెపి కార్యక్రమం ప్రారంభమైంది.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఓబీసీ మోర్చా తెలంగాణ ఇంచార్జి, బీహార్ ఏమ్మెల్యే అరుణ్ శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క కృష్ణ,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్బంగా కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్ అనేగోని భాస్కర్ గౌడ్,బిజెపి నాయకులు వెంకటయ్య,మెండే కుమార్ యాదవ్,బొద్ధం వెంకటేష్, మల్చలం లింగం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking