క్యాంటీన్ ప్రారంభం
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
ఏరియా జిఎం కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది సౌకర్యార్థం గురువారం ఫీడర్ క్యాంటీన్ ను ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం ఓదెలు, టిబిజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసి ఫిట్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సింగరేణి ఉన్నత అధికారులు, యూనియన్ నాయకులు, జిఎం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.