అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గురుదత్త పాదుకలు స్థాపక ఊరేగింపు కార్యక్రమం
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి వారి ప్రత్యక్ష పర్వేక్షణలో శ్రీ గురుదత్త పాదుకలను గుల్మోహర్ పార్క్ కమాన్ నుండి శ్రీ సాయి బృందావన క్షేత్రము వరకు అత్యంత వైభవంగా రాగం దంపతుల సమక్షంలో కుటుంబ సమేతంగా ఊరేగింపుగా వచ్చిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ . అనంతరం శ్రీ సాయి బృందావన క్షేత్రములో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ షిరిడి సాయిబాబా కృపకు పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రాగం అభిషేక్ యాదవ్, బేరి రామ్ చందర్ యాదవ్, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, భాగ్యలక్ష్మి, నిరూప, కుమారి, జయమ్మ, కళ్యాణి, సత్యనారాయణ, మునియా నాయక్, మహేందర్ సింగ్, తుకారం, నవీన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.