దోమల బెడద నుండి రక్షించాలని అధికారులకి అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య వినతి

దోమల బెడద నుండి రక్షించాలని అధికారులకి అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య వినతి

 శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కన్వినింగ్  కమిటీ తరుపున చందానగర్ సర్కిల్-21  అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రాన్ని ఇస్తూ ఏ.ఐ.ఎఫ్. డి. వై నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, దాసరి కీర్తి, ఎండి సుల్తానా బేగం మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని అనేక మురికి వాడాలలో మరియు కాలనీలలో ఒకరీతమైన దోమల బెడగా ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తుంది. సాధారణంగా సీజన్ కాలంలో వచ్చే వ్యాధులకన్న ప్రస్తుత ఎండాకాలంలో ఉక్కపోత తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దీనికి తోడుగా ప్రజల పైన దోమల విజృంభన ఎక్కువ అయ్యింది. నాలా,యూజిడి ప్రాంతాలలో  టి ఎన్ నగర్ ,ఎఫ్. సి. ఐ కాలనీ, న్యూ కాలనీ,ఓంకార్ నగర్, స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ లో పాత ఇండ్లు కూల్చిన వ్యర్ధాలు డంపు చేసి తీవ్రమైన దుర్గంధం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మ్యాన్ హాల్ మూతలు పగిలి డ్రైన్ జాం అవడం వల్ల రోడు పైకి మురుగు నీరు ప్రవహిస్తున్నాయి నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, డైనమిక్ కాలనీలలో నివసిస్తున్న ప్రజల పైన దోమల దాడి పెరుగుతుంది. ముఖ్యంగా మియాపూర్ డివిజన్ లోని మురికివాడలలో వర్ష కాలం కన్నా ప్రస్తుతం దోమల బారి నుండి ప్రజలను రక్షించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మురికివాడలలో, కాలనీలో దోమల నివారణ కోసం తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా,ప్రజలను దోమల నుండి తదితర వ్యాధుల నుండి రక్షించవలసిన స్థానిక కార్పొరేటర్ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో మియాపూర్ డివిజన్ పరిస్థితి రెంటికి చేరిన రేవడి లా తయారైంది. అభివృద్ధి అయితే మాయమైపోయిందని కనీసం ప్రజలు రోగాల బారిన పడకుండా దోమల నివారణ కోసం  స్ప్రే చే  పించవలసిందిగా అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కన్వినింగ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking