పుప్పాలగూడలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదు.
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి: గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ గ్రామంలో తమకు పార్టీ సరైన గుర్తింపుని ఇవ్వడం లేదని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అయిన పుప్పాలగుడ గ్రామం నుండి శాసనసభ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, శాసన మండలి ఎన్నికలలో పార్టీ సభ్యూలకు మెజారిటీ రావడం జగమెరిగిన సర్వ సాధారణ విషయమని పేర్కొన్నారు.అయినప్పటికీ పార్టీ పెద్దలు తమకు సరియైన గుర్తింపు ఇవ్వడం లేదని ఇక్కడి సీనియర్ నాయకులు, కౌన్సిలర్ లుగా పోటీచేసిన వ్యక్తులు పార్టీ కార్యకలాపాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని గుర్తు చేశారు, అట్టి పరిస్థితిని చేజించి నాయకులందరూ పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానం గౌరవంతో అంతర్గతంగా సమావేశమై రాబోయే అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దీర్గంగా చర్చించుకొని ఏకాభిప్రాయంతో ప్రస్తుత కాలంలో పార్టీ ఆదేశానుసారం తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేసుకొని, స్థానిక శాసన సభ్యునితో సమావేశం జరుపుకొని తమ దీన పరిస్థితిని వివరించి పరిస్థితులు సఖ్య పడేలా అందుకు అనుకూలంగా స్థితి గతులను మలుచుకుని పార్టీ బలోపేతానికి నడుంబిగించి ముందుకు వెల్డామని నిర్ణయం తీసుకున్నారు.అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా బషీర్ అందరికి ఖర్జూర పండ్లను వితరణ చేయడం జరిగింది, ఈ సమావేశంలో మాజీ ఎంపిపి శివప్రసాద్, సునీత రాజ్ కుమార్, కృష్ణ రాజి, లక్స్మిశ్రీ, గుట్టమీది నరేందర్, చంద్రకాంత్ గౌడ్, బషీర్, విఠల్, అందె లక్ష్మణ్ రావు, గణేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, సంతోష్ కుమార్, శ్రీశైలం, ప్రకాష్, రాజేష్, మహేందర్, సుమన్ పాల్గొన్నారు.