ఆర్టిజను కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
ఆర్టిజను కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. కేటిపిఎస్ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆర్టిజను కార్మికులు చేస్తున్న మహాధర్నాకు గురువారం మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టిజను కార్మికులకు పర్మినెంట్ చేయాలని స్టాండింగ్ రూల్స్ రద్దు చేసి ఏపీఎస్ఇబీ సర్వీసు రేగులేషన్స్ వర్తింపజేయాలని వారి పర్సనాల్ పే ను బేసిక్ పేలో కలపాలని 50 శాతం పీఆర్సీ వర్తింపజేయలని విద్య అర్హత బట్టి ప్రమోషన్ సదుపాయం కల్పించాలని ఓకే సంస్థ ఓకే రూల్ అమలుజేయలని డిమాండ్ చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వాలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. 2018 ఎన్నికలకు ముందు ఆర్టిజను కార్మికులకు పర్మినెంట్ చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు గంధం మల్లికార్జున రావు, సాయి, జెట్టి ఆనందరావు, అల్లకొండ శరత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.