12కోట్ల నిదులతోశంషాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్”
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి: శంషాబాద్ మున్సిపాలిటీని సుందరంగా అభివృద్ధి చేసి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు 12కోట్ల రూపాయల బడ్జట్టును మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. అందులో భాగంగా గురువారం 23 వ వార్డ్ మధురనగర్ కు 70లక్షలు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.అట్టిపనులకు ఛైర్మెన్ కొలన్ శుష్మమహేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,స్థానిక కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు.
70 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే మిగతా నిధులతో ఇతర వార్డులలో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు.దశలవారీగా ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను ప్రారంభించామని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులు పూర్తి ఐతే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు.నిర్మాణంలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విదంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
త్వరలోనే మరిన్ని నిధులు తీసుకువచ్చి మధురనగర్ అభివృద్ధికి సహకరిస్తా అన్నారు.
ఈ కార్యక్రమం లో కమిషనర్ భోగేశ్వర్లు,నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్,సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, కో ఆప్షన్ సభ్యులు కవిత ప్రసాద్, దీపామల్లేష్, సొసైటీ చైర్మన్ ముద్దం మల్లారెడ్డి, మధురనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు గోటూరి పవన్ గౌడ్, నామ చంద్రశేఖర్, తోటరాములు, నర్సింహా గౌడ్, జైహింద్ రెడ్డి, సౌమ్య, ఇంద్రాణి, గోవర్ధన్ రెడ్డి, జెల్లపల్లి శ్రీనివాస్,గోపాల్ రెడ్డి, సుభాష్ భాయ్, శ్రీశైలం, రామావత్ శర్మ, గుంటి రవి, దేవేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదగిరి, గోపాల్ నాయక్, గొంగళి రవి, సురేష్, మలచలం నరేష్, దామోదర్ రావు,మల్లికార్జున్ రెడ్డి,సాయి, విరాట్, బంటి,తదితరులు పాల్గొన్నారు.
Prev Post