సిసి రోడ్డు పనులను ప్రారంభించిన చైర్ పర్సన్
చేర్యాల,ఏప్రిల్ 13 అక్షిత ప్రతినిధి: చేర్యాల మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డులో గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ అంకు గారి స్వరూప రాణి స్థానిక వార్డు కౌన్సిలర్ తో కలిసి సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తుమ్మలపల్లి లీలా,చెవిటి లింగం, ఆడుపు నరేందర్, సందుల సురేష్, పచ్చిమట్ల సతీష్,కో ఆప్షన్ సభ్యురాలు అంజలి,రైతు సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి, నాయకులు యాదగిరి,సంజీవులు, మరియు ఏఈ శ్రీకాంత్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.