ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో రంజాన్ పర్వదినం నిర్వహించుకోవాలి. ముస్లింల పక్షపాతి సీఎం కేసీఆర్. గత పాలకవర్గాలు ముస్లింలను ఓటు బ్యాంకు గానే వాడుకున్నాయి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో రంజాన్ పర్వదినం నిర్వహించుకోవాలి.

ముస్లింల పక్షపాతి సీఎం కేసీఆర్.

గత పాలకవర్గాలు ముస్లింలను ఓటు బ్యాంకు గానే వాడుకున్నాయి

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో రంజాన్ పర్వదినం నిర్వహించుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్   అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 16వ వార్డులో గల మదీనా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం నుండి సరఫరా కాబడిన రంజాన్ తోఫా దుస్తులు ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు  రంజాన్ తోఫా పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగల్లో ప్రభుత్వ భాగస్వామ్యంతో పండుగల ప్రాధాన్యతను పెంచామన్నారు. అన్ని కులాల మతాల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించుకునే పండుగల్లో ప్రభుత్వం భాగస్వామ్య మై పండుగలు ఘనంగా నిర్వహించేందుకు సహకారం అందించిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల పక్షపాతి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను సామాజికంగా విద్యాపరంగా రాజకీయపరంగా చైతన్యపరిచే మన్నారు. ముస్లింలకు షాదీ ముబారక్ పథకం మైనార్టీ గురుకులాలు ,ఈద్గా లు, మసీదులు కబరిస్తాన్ ల , పీర్ల కొట్టాల అభివృద్ధి ,మౌజన్ లకు,ఇమామ్ లకు  గౌరవ వేతనాలు ఇస్తూ  వారిని ఆర్థికంగా  ఆదుకుంటున్న మన్నారు. గత పాలకవర్గాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. రంజాన్ పండుగ రోజు కొత్త బట్టలు ధరించి ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పవిత్ర తకు మారుపేరైన రంజాన్  ఈ మాసంలో ఉపవాస దీక్షకు ప్రభుత్వం తరఫున విందులు ఏర్పాటు చేస్తూ  ముస్లింల ఆదరాభిమానాలను ప్రభుత్వం పొందుతుందన్నారు. ముస్లింలు సీఎం కేసీఆర్ వెంట నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో , ఎంపీపి చింత.కవిత రెడ్డి,16వ వార్డు కౌన్సిలర్ కల్లూరి పద్మజ,  టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరావు, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ , కౌన్సిలర్లు షఫీ, వేంపటి.మధుసూదన్, తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ, ముస్లిం మైనార్టీ నాయకులు  షేక్ నయీమ్, అబ్బు, మొషిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking