ఓర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆడిటోరియం. హార్టికల్చర్ పాలీహౌస్ ను ప్రారంభించిన… కౌన్సిలర్ నర్సిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఓర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆడిటోరియం. హార్టికల్చర్ పాలీహౌస్ ను ప్రారంభించిన…
కౌన్సిలర్ నర్సిరెడ్డి శ్రీనివాసరెడ్డి….
మేడ్చల్, అక్షిత బ్యూరో:
దుండిగల్ పురపాలక పరిది భౌరంపేట్ లోని ఓర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడిటోరియం. హార్టికల్చర్ పాలీహౌస్ ను భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని గురువారం ప్రారంభించారు. అనంతరం. మాట్లాడుతూ ఆధునిక యుగంలో విద్యార్థులకు ఉపయోగపడేలా హార్టికల్చర్ పోలీహౌస్ ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అన్నారు, దీని వల్ల విద్యార్థులకు మొక్కల పెంపకం ఫామింగ్ గురించి నూతన విషయాలు తెలుసుకునె అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డా,అరుణ రావ్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు