పీడిత ప్రజల గొంతుక డాక్టర్ కందాళ శోభారాణి ‘యాది’ సభను జయప్రదం చేయండి.

పీడిత ప్రజల గొంతుక డాక్టర్ కందాళ శోభారాణి ‘యాది’ సభను జయప్రదం చేయండి.

వరంగల్ అక్షిత బ్యూరో: పీడిత ప్రజల పక్షాన పనిచేసిన రచయిత్రి కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కందాల శోభారాణి సంతాపసభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు నగరంలోని ఖిలా వరంగల్ పడమరకోట చమన్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పోస్టర్ ఆవిష్కరించారు

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ శోభారాణి గత ఫిబ్రవరి నెల 12వ తేదీన అనారోగ్యంతో మరణించిందని ఆయన అన్నారు శోభ రాణి విద్యార్థిగా పరిశోధకురాలుగా సమాజంలో జరిగే అన్ని రకాల   అణచివేతలకు వ్యతిరేకంగా పనిచేశారని సామాజిక చైతన్యంతో ప్రజా పోరాటాలను బలపరిచారని ఆయన అన్నారు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసుల కోసం జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు సింగరేణి ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని ఆయన అన్నారు

ఈ పితృ స్వామికి సమాజంలో మహిళల పట్ల ఉండే వ్యతిరేకత అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక చైతన్యంతో పనిచేశారని ఆయన తెలిపారు

శోభారాణి యాది సభ హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తేదీ 15 న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు ఈ సభకు జర్నలిస్ట్ కే రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారని ప్రొఫెసర్ హరగోపాల్   కేయూసి వైస్ ఛాన్స్లర్ తాటికొండ రమేష్ ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్ తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రగశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి సంధ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క చైతన్య మహిళా సంఘం నాయకురాలు బి జ్యోతి లతోపాటు తదితరులు ఉపన్యాసిస్తారని ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మైదం పాణి ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు గండ్రాతి హరిబాబు ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు బైరబోయిన ఐలయ్య ఎండి అక్బర్ కుమారస్వామి రాజేష్ వెంకట్ సాబిన్ కారి మోహన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking