ఎక్స్ గ్రేషియా సొమ్ము దొరలే కట్టాలి -దొరల ఆనందం కోసమే గిరిజనులు బలి -అబద్ధాల ప్రచారానికే ఆత్మీయ సమ్మేళనాలు -బీసి జేఎసి చైర్మన్  పాల్వంచ రామారావు

ఎక్స్ గ్రేషియా సొమ్ము దొరలే కట్టాలి

-దొరల ఆనందం కోసమే గిరిజనులు బలి

-అబద్ధాల ప్రచారానికే ఆత్మీయ సమ్మేళనాలు

-బీసి జేఎసి చైర్మన్  పాల్వంచ రామారావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో  :

ఖమ్మం జిల్లా చీమలపాడు సంఘటనలో మృతి చెందిన గాయపడిన బాధితులందరికీ నష్టపరిహారం బిఆర్ఎస్ పార్టీ దొరల నుండే వసూలు చేయాలని బీసి జేఎసి చైర్మన్  పాల్వంచ రామారావు డిమాండ్ చేశారు. కేసిఆర్ పాలన తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల ఎక్స్ గ్రేషియాలు చెల్లించటానికి కోట్లాది రూపాయలు మద్యం రేట్లు విపరీతంగా పెంచి లెక్కలేనన్ని బెల్ట్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంచి ప్రజల చెమట పిండి రక్తం పిండి వసూలు చేయడం దుర్మార్గమన్నారు.బిఆర్ఎస్ నాయకులు 20 శాతం నాసిరకం పనులు చేసి 80% దోపిడీ చేసి కోట్లాది రూపాయలు జేబులు నింపుకున్నారన్నారు.ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవటానికే పరిపాలన గాలికొదిలేసి  జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అభివృద్ధి ప్రదాతలని పేదల పాలిటి పెన్నిధులని అబద్దాల అభివృద్ధిని  ప్రచారం చేస్తూ వాట్సాప్ లలో పెట్టించుకోవటం భజన పత్రికల్లో రాయించుకుంటున్నారని ఏనాడో ప్రజలకు తెలిసిపోయింది అన్నారు. అవినీతి సొమ్ముతో రాజాధిరాజా రాజ రాజమార్థాండ అని  దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి మేళ తాళాలు గాన బజానాలు పూలవర్షాలు కురిపించుకోవడం జిందాబాద్ లు జేజేలు  కొట్టించుకోవడం దొరల సరదా కోసం పైశాచిక ఆనందం పొందటానికి ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి  బాంబుల వర్షం కురిపించుకోవడం ఇది అత్యంత అవినీతిపరుల లక్షణమన్నారు.వీరెంతటి అభివృద్ధి నిరోధకులో ఎంతటి అవినీతిపరులో కేసిఆర్ తో జతకట్టకముందు మీసంపద ఎంతో ఇప్పుడు మీ సంపద ఎంతో మీరు నీతిమంతులు అయితే మా బీసీ జేఏసీ బృందంతో  బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking