ఆన్ లైన్ గేమ్స్   బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ఆన్ లైన్ గేమ్స్   బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు

వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ ఓసిటి కేంద్రంగా అన్లైన్ గేమ్స్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహ మొత్తం

ఆరుగురు ముఠా సభ్యులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. వీరినుండి పోలీసులు సూమారు పది లక్షల విలువగల మూడు ల్యాప్ టాప్లు, పదమూడు సెల్ఫోన్లు, ఒక లక్ష 90వేల రూపాయల నగదు ఒక ద్విచక్ర వాహనం, వివిధ బ్యాంకులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ వివరాలను వెల్లడిస్తూ ఛత్తీస్ ఘడ్:

రాయచూర్ ప్రాంతానికి చెందిన పఠాన్బాబ(23), పటాన్ ఖాసీం ఖాన్ (28), ఓడిషాకు చెందిన చాందిన

నాగ్ (27)తో పాటు సయ్యద్ సల్మాబేగ్ (26), ఖమ్మంకు చెందిన మొగల్ మున్న (19), గుంజ కళ్యాన్ (20) వీరందరు

ఓ ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ ముఠా ఆన్లైన్ గేమ్స్

బెట్టింగ్ కు తెరతీసారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ఎంపిక చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ద్వారా బెట్టింగ్లో పాల్గొనే వారు ముందుగా ఈ ముఠా సూచించిన ఆన్లైన్ లో ముందుగా కొంత మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాల్సి వుంటుంది. డబ్బును డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఈ బెట్టింగ్ నిర్వహకులు యూజర్ నేమ్, పాస్వర్డ్ను అందజేసారు. దీని ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ వ్యహారం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడంతో ఈ బెట్టింగ్ ముఠా ఐపిఎల్ క్రికెట్పై జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తోంది. అట్టింగ్లో గెలిచిన వారికి రెండింతలు డబ్బును డబ్బును అందజేసేవారు. ఈ ముఠా గతంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా బెట్టింగ్ నిర్వహించింది. ఓసిటి కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ పోలీసులు నిన్న సాయంత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోని వారి నుండి పోలీసులు ల్యాప్టాప్లు, డబ్బులు, సెల్ఫోన్లును స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసిపి బోనాల కిషన్, మిల్స్ కాలనీ, సైబర్ క్రైమ్స్ ఇన్సెస్పెక్టర్లు ముస్కా శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి, సైబర్ క్రైం ఏఏఓ ప్రశాంత్ మీల్స్కలనీ ఎస్.ఐ కుమార్, ఏఎస్.ఐ. స్వరూప, కానిస్టేబుళ్ళు భౌసింగ్, వీరన్న, హెంగార్డ్ నాగేశ్వర్రావు డిసిపి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking