కోణిజర్లలో యూటిఎప్ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కోణిజర్లలో యూటిఎప్ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జడ్పిహెచ్ఎస్ కొణిజర్ల ప్రాంగణంలో కొణిజర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జడ్పీహెచ్ఎస్ కొణిజర్ల ప్రధానోపాధ్యాయులు డి పుల్లయ్య పాల్గొనగా సీనియర్ కార్యకర్త జిల్లా మాజీ కార్యదర్శి బండి కృష్ణారావు చేతుల మీదగా అరుణ పతాకావిష్కరణ కావించబడినది.ఈ కార్యక్రమంలో టీఎస్ కొణిజర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు లాల్ సయ్యద్ జిడిఎస్వి రమణ ఉపాధ్యక్షులు జమలయ్య కార్యదర్శులు డి శ్రీనివాస్ ఎస్వీ నాగమణి సీనియర్ కార్యకర్త విజయలక్ష్మి ఉదయలక్ష్మి వీర కుమారి డి శ్రీనివాస్ స్వరూప తిరుమల ప్రసాద్ జయ లక్ష్మణ్ స్వప్న టిపి వెంకటేశ్వర్లు అప్పారావు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విద్యారంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని సత్వరమే ప్రమోషన్లు నిర్వహించి రిక్రూట్మెంట్ చేయాలని విద్యారంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వ నూతన విద్య పాలసీని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగస్తులకు ఒకటో తారీకు వేతనాన్ని ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking