అంబేద్కర్ ఆశయా సాధన కోసం బైక్ ర్యాలీ
చేర్యాల,ఏప్రిల్ 13 అక్షిత ప్రతినిధి: అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో బీజేఆర్ యూతు ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం బైక్ ర్యాలీని ఏర్పాటు చేయగా,ఈ బైక్ ర్యాలీ ని గ్రామ సర్పంచ్ చీపురేఖ మల్లేష్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.బిజెఆర్ సభ్యులు ఆకునూరు,రాంపూర్ మరియు మసిరెడ్డిపల్లి గ్రామాలలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం బిజెఆర్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధాన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు నడవాలని, రాజ్యాంగాన్ని కాపడుకోవాల్సిన భాద్యత అందరిపైన ఉందని, కావున నేడు ఆకునూరు గ్రామంలో జరిగే అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ కోతి దాసు,బిజె ఆర్ అధ్యక్షులు ఎర్రోళ్ల కృష్ణ, ఉపాధ్యక్షులు కోతి విశ్వేస్,మాజీ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీను,మరియు యూత్ సభ్యులు కర్ణకార్,శ్రీకాంత్, హరీష్, మహేందర్, వేణు,కిషోర్, రవి,బాల చంద్రం తదితరులు పాల్గొన్నారు.