ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి     

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి                             

అక్షిత ప్రతినిధి వేములపల్లి: 

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య,బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షుడు మొల్కపట్నంగ్రామపంచాయతీ సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం వేములపల్లి మండలం మొల్కపట్నం రావులపెంట లక్ష్మీదేవిగూడెం ఆమనగల్లు గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినధాన్యంకొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగావారుమాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అరబెట్టిన దాన్యాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరనుపొందాలన్నారు.ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకుకొనుగోలు చేసి క్వింటాకు ధర ఏ గ్రేడుకు రూ.2060 , బి గ్రేడ్ రూ. 2040 మద్దతుధరచెల్లిస్తుందన్నారు. రైతులు రైతు పాసుబుక్, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు జిరాక్స్  కాపీలని తీసుకుని వచ్చిధాన్యాన్నివిక్రయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దనిశశిధర్ రెడ్డి, సర్పంచులు చెర్కుపల్లి కృష్ణవేణిసుమన్,వల్లంపట్ల ఝాన్సీప్రవీణ్,ఎంపీటీసీలు నంద్యాల శ్రీరాంరెడ్డి, మేక లలితరవి,ఉప సర్పంచ్ చెన్నబోయిన లక్ష్మమ్మ,సైదులు ఏఓ ఋషేంద్రమణి ఏపీఓ అనోక్ ,సీసీలు చిరుమర్రి గోపినాథ్,రమణయ్య ,సురేందర్ రెడ్డి,ఏఈఓ స్వాతి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పేరాల కృపాకర్ రావు కందూల నాగిరెడ్డి,పేరాల గురువరావు,కోలపాపయ్య పేరాలరమేష్ మేక దేవరాజ్ పల్లా వెంకన్న మద్దేనబోయిన శ్రీను జానకిరెడ్డి నిర్వాహకులు యమున రాధ యాదమ్మ కోలా కళమ్మ నాగమణి జయమ్మ ఝాన్సీ సుజాత వెంకటరమణ మంగమ్మ లక్ష్మమ్మ జయమ్మ మాధవి రేణుక తోపాటు రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking