సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ అందజేత
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
సింగరేణి ఏరియా జిఎం కార్యాలయంలో గురువారం ఏరియాలోని ఆర్కే 1ఏ గనిలో సపోర్ట్ మెన్ గా పనిచేస్తున్న కే శంకర్ కుమార్తె కే సుష్మిత కు హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నందున్న ఆమెకు సింగరేణి యాజమాన్యం ఇస్తున్న 10వేల రూపాయల మెరిట్ స్కాలర్ షిప్ చెక్కును ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి విద్యార్థిని తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదువుతున్న ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం మెరిట్ స్కాలర్ షిప్ లను అందజేస్తుందని తెలిపారు. తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టిబిజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పిఓ ఆసిఫ్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.