విద్యార్థులు లక్ష్యసాధన వైపు అడుగులు వేయాలి
డాక్టర్ వి సుకుమార్ రెడ్డి
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలకు చెందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలిసి జయశ్రీ గార్డెన్ లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ డా.వి.సుకుమార్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తూ..ఉన్నత శిఖరాలు చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. రేపటి తరానికి మార్గదర్శకులుగా తయారుకావల్సిన అవసరం నేటి విద్యార్థులపై ఉన్నదని గుర్తు చేశారు. విద్యార్థులు జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవర్చుకోవాలని అప్పుడే విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షర జ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ ఎం.సుభాష్ రెడ్డి,డైరెక్టర్ జి.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ బి.మహేందర్ రెడ్డి , కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.