నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ గా అక్కిరాజు రజనీకాంత్ నియామకం.
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ , రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టం, నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జీ గా సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అక్కిరాజు రజనీకాంత్ ను ఇంచార్జీ గా నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేశారు. నా ఎన్నికకు సహకరించిన నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ పద్మావతి కి, టి పి సి సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలను చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసి సక్రమంగా నిర్వర్తిస్తానని వారు తెలిపారు.