కోలాం హక్కుల పోరాట సమితి
సర్వేనెంబర్ 20 రామయి శివారండిజిటల్ పట్టా పాస్ బుక్ లో ఇప్పించాలని,
డిమాండ్
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కోలాం హక్కుల పోరాట సమితి
ఆధ్వర్యంలో.. సర్వేనెంబర్ 20 రామయి శివారం అదిలాబాద్ మండలం డిజిటల్ పట్టా పాస్ బుక్ లో ఇప్పించాలని, ఆదివాసుల పోడు భూములకు పట్టాలు వన్ బై సెవెంటీ చట్టాన్ని, పిసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… కోలాం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కోడప సోనేరావు ఆధ్వర్యంలో మహాధర్న కార్యక్రమం చేపట్టడం జరిగింది…. ఈ సందర్భంగా సోనే రావ్ మాట్లాడుతూ…. నిరుపేద వ్యవసాయ కూలీలమైన ఎస్సీ ఎస్టీ బీసీ గోండు, కోలాం, పర్దాన్,మాల మాదిగ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ నిరుపేదలని గుర్తించి అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్డీవో తాసిల్దార్ అధికారులు.1979, 80 సంవత్సరంలో రామాయి శివారంలోని అదిలాబాద్ మండల సర్వేనెంబర్ 20 ఏ లో మొత్తం 480 ఎకరాల భూమిని సీలింగ్ చట్టం ద్వారా పేదలను గుర్తించి పట్టాలు ఇవ్వడం జరిగినదని,, ఇట్టి భూమిలో కొంత పోడు రాళ్లు ఉన్నవి అని, మేము గత 1990 నుండి 20 23 వరకు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలోభూప్రక్షాళన చేసి పాతపట్టా పాస్ బుక్ లు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మేము చాలాసార్లు అధికారులకు విజ్ఞప్తిపత్రం ఇచ్చినాము,.ఏవో సాకులు చెబుతున్నారు.. మేము గత 40 సంవత్సరాల నుండి వ్యవసాయ పంట రుణం, బ్యాంకులో నుండి క్రాప్ లోనే తీసుకుంటున్నాం అని, ఈ మధ్యకాలంలో 2016 నుండి బ్యాంకు వాళ్లు క్రాప్ లోన్ డిజిటల్ పట్టా లేక కంప్యూటర్ పహాని ఉంటేనే క్రాప్ లోన్ ఇస్తామంటున్నారు అని, మేము పాత క్రాప్ లోన్ అప్పులుగా మిగిలి ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కంప్యూటర్ డిజిటల్ పట్టా లేనిదే మాకు ఈ పేద ప్రజలకు రైతుబంధు రావడంలేదని, కేంద్ర ప్రభుత్వ కిసాన్ యోజన స్కీం ద్వారా వచ్చే డబ్బులు రావడంలేదని, తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా యజమాని మరణిస్తే డిజిటల్ పట్టా లేనందున ఐదు లక్షల ఇన్సూరెన్స్ రావడం లేదని, కావున జిల్లా కలెక్టర్ ఈ పేద వర్గాలపై కనికరించి కంప్యూటర్ డిజిటల్ పట్టాలి ఇప్పించగలరని, లేనిపక్షంలో మూకుమ్మడి అమర నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దల శంకర్, ఉప్పరి లింగన్న, కోరండ్ల ఆశన్న, పెరిక రాజేశ్వర్, మడావి గణేష్, రోడ్డ నారాయణ, పలు గ్రామాల నుండి వచ్చిన కొలాం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.