రంజాన్ కానుకలు పంపిణి చేసిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

రంజాన్ కానుకలు పంపిణి చేసిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

పినపాక అక్షిత ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్, ఎమ్మార్వో ఆఫిస్ నందు పవిత్ర రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా రంజాన్ దుస్తుల కానుకల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్య ఉదేశ్యం అన్ని మతాలకు అతీతంగా ముస్లిం సోదరి సోదరిమానులు కూడా పవిత్ర రంజాన్ పండగని ఆనందంగా జరుపుకోవాలని రంజాన్ కానుకలు పంపిణి చేయటం జరుగుతుంది అన్నారు. అన్ని మతాలకు సంబందించిన పండగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమానంగా గుర్తిస్తుందని అన్నారు. పండగలను ఘనంగా జరుపుకోవడానికి ముందుగానే కానుకలు పంపిణీ చేస్తుంది అన్నారు. అందరికి ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ , ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, ఉప అధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి , మైనారిటీ సేల్ అధ్యక్షులు సాధిక్ పాషా , సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, సర్పంచులు,కోర్స లక్ష్మి, తుపాకుల రామలక్ష్మి,పోతునూరి సూరమ్మ, కుంజా చిన్నబాయి, గ్రామాకమిటి అధ్యక్షులు సోహెల్ పాషా బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, వార్డు మెంబెర్స్, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహారావు, ఎం ఆర్ ఓ భగవాన్ రెడ్డి, మండల మైనారిటీ కమిటీ సభ్యులు,  మండల నాయకులు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking