తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేద్దాం టిడిపి పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం. టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ముత్తినేని సైదేశ్వరరావు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేద్దాం
టిడిపి పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం.
టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ముత్తినేని సైదేశ్వరరావు.
కోదాడ టౌన్, అక్షిత న్యూస్:
కలసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం అయిన సందర్భంగా పట్టణంలోని 14వ వార్డు లో గల బీసీ నాయకులు, అభిమానులు వారి నియామకం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గత తెదేపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను ఎలా మభ్యపెడుతున్నాయో ప్రజలందరూ తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివేకానంద, వెంకటేశ్వర్లు, శ్రీను, రామకృష్ణ, బ్రహ్మం, అంజయ్య, లింగరాజు, రాంబాబు, నాగేంద్ర, రాధాకృష్ణ, అయ్యప్ప, వీరబాబు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.