నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ తెలంగాణ చౌటుప్పల్ లో 100 పడకల ఆసుపత్రి కీ శంకుస్థాపన చేసిన ఆరోగ్య మంత్రి* తన్నీరు హరీష్ రావు
నాణ్యమైన వైద్య
విద్యకు కేరాఫ్ తెలంగాణ
చౌటుప్పల్ లో 100 పడకల ఆసుపత్రి కీ శంకుస్థాపన చేసిన ఆరోగ్య మంత్రి*
తన్నీరు హరీష్ రావు
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
చౌటుప్పల్ పట్టణ పరిదిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వంద పడకల ఆసుపత్రికి మంత్రులు హరీష్ రావు,జగదీష్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు.
జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరుగుతాయి అని
అత్యవసర సమయాల్లో హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటం వీలవుతుందని, గోల్డెన్ అవర్ లో చికిత్స అందించి, తద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యం గురించి రూ. 1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని తెలియజేశారు.
నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందని, ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారని,నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్ పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తామన్నారు.తెలంగాణ వచ్చాక సీఎం నల్గొండకు ఎంతో చేశారన్నారు.రాష్ట్రం వచ్చాక నాలుగు ఇస్తే, రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చామన్నారు.ఎయిమ్స్ అతీగతీ లేదు. ఓపీ తప్ప, ఐపీ లేదని,2018 ప్రారంభంఅయితే మొన్న వచ్చి మోడీ భూమి పూజ చేసారని,
ఎయిమ్స్ పై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు.

కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని,నాడు 3 ఉంటే, నేడు 102డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
మారు మూల ప్రాంతాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని,
పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో 500 వరకు బస్తి దవాఖానల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం వైద్యం పై ప్రజలు కు నమ్మకం పెరిగిందన్నారు.
ఏప్రిల్ చివరి లోపు రాష్ట్రం అంతటా న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని,జిల్లాల్లో కీమో థెరపీ సేవలు ప్రారంభించామని, సూర్యాపేట లో ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంపై ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్ కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, చూస్తూ కూర్చోలేదు, చేతల్లో చూపెట్టాడని తెలియజేశారు.
తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, మీ కండ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే సమాధానం అని తెలిపారు.
తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నా, వైద్య విద్య అన్నా.. తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేదని అన్నారు. ఉమ్మడి పాలనలో సరైన వైద్యం అందక ప్రజలు అనుభవించిన నరకయాతనను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలని,నిర్ణయించారన్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నాడు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు.
2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతున్నాయని తెలియజేశారు.65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగిందని,మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే, ఇప్పుడు 7090కి పెరిగాయని, ఈ ఏడాది 9 కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే 7990 అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖమాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పామేల సత్పతి , చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.