సీఎండీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి * 6వ దశ నిర్మాణ కార్మికులకు 7వ దశలో ఉద్యోగాలు కల్పించాలి * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

సీఎండీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

* 6వ దశ నిర్మాణ కార్మికులకు 7వ దశలో ఉద్యోగాలు కల్పించాలి

* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

కేటిపిఎస్ 6వ దశ నిర్మాణంలో పనిచేసిన కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తానని రాతపూర్వకంగా సీఎండీ రాసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. మంగళవారం స్థానిక కేటిపిఎస్ అంబేద్కర్ సెంటర్ లో 6వ దశ నిర్మాణ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలో భాగంగా రెండవ దీక్షలను ప్రారంభించి కామేష్ మాట్లాడుతూ సుమారు 400 మంది కార్మికులు 15 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కాళ్ళు చేతులు పోయిన ఎన్నో ప్రమాదాలకు గురైన తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 6వ దశ నిర్మాణంలో పనిచేశారని కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే వారు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించగా నాడు సీఎండీ 7వ దశలో పనికి తీసుకుంటామని వ్రాత పూర్వకంగా రాసి ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందంచి కార్మికులను 7దశలో పనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, జెట్టి ఆనందరావు, కార్మికులు ఎస్.కే.రావూఫ్, శ్రీనివాసరావు, రమేష్, శనగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking