ముస్లిం పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
రాజ్ మహమ్మద్-జాన్ బి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ పాషా జునేద్ ఆధ్వర్యంలో పలు ముస్లిం పేద కుటుంబాలకు మంగళవారం నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ సర్పంచ్ గుమ్మడి సాగర్ మాట్లాడుతూ రజాక్ కుటుంబ సభ్యులందరి సహకారంతో ఏర్పాటైన ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి రుద్రంపూర్ గ్రామంలో ఫ్రీజరీ బాక్స్ ఫ్రీ సర్వీస్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ నందు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.

హెల్త్ స్పోర్ట్స్ కు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామంగా భావిస్తూ, ఈ ట్రస్టు ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఆ దేవుడి దయ వల్ల అందరూ మంచి ఉండాలని ట్రస్ట్ సభ్యులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మడి సాగర్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఫాతిమా, డేవిడ్ రాజ్, అంతర్పుల శివ, మోహన్ రెడ్డి, గోపాలకృష్ణ, కృష్ణంరాజు, దశరథ, రామారావు, రాజేష్ యువకులు మహిళలు పాల్గొన్నారు.