డాక్టర్ పులిపాటి ప్రసాద్ కు పితృ వియోగం
-కీర్తిశేషులు పులిపాటి నరసింహారావుకు పలువురి ఘన నివాళులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి పులిపాటి నరసింహారావు అకాల మరణం వారి సామాజిక వర్గానికి కుటుంబ సభ్యులకు తీరనిలోటు అని ఖమ్మం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిరిశాల కృష్ణారావు ఉపాధ్యక్షులు మాదిరాజు లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ మన్నేపల్లి బసవయ్య స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పసుపులేటి శ్రీనివాసరావు న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరీ టియుడబ్ల్యూజే ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా సహాయ కార్యదర్శి జర్నలిస్టు జానిపాషా అన్నారు.మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పులిపాటి ప్రసాద్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ ని పరామర్శించి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా పులిపాటి ప్రసాద్ తనతండ్రి పేరుతో నిరుపేద విద్యార్థుల చదువుల నిమిత్తం స్కాలర్షిప్ లను కులమతాలకతీతంగా నిర్వహించనున్నట్లు సమాజిక సేవలను ముమ్మరం చేస్తున్నట్లు పులిపాటి ప్రసాద్ మీడియాకు వివరించారు.పులిపాటి నరసింహారావు ఈనెల 13న పరమపదించారు.ఈ వార్త తెలుసుకున్న అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలు మేధావులు అడ్వకేట్లు వ్యాపార సామాజిక వేత్తలు రాజకీయ మేధావులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ని పరామర్శించారు.పులిపాటి నరసింహారావు మృతి పట్ల సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈకార్యక్రమంలో పలు విద్యాసంస్థల అధినేతలు పలువురు పాల్గొన్నారు.