అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ ఇష్ట రాజ్యంగా అక్రమ పోస్టింగ్ భర్తి

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ

ఇష్ట రాజ్యంగా అక్రమ పోస్టింగ్ భర్తి

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తి

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు

ఉపాధి కల్పన అధికారి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విచ్చలవిడిగా ఎలాంటి పత్రిక ప్రకటన నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ యాజమాన్యులు అభ్యర్థుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుని ఇతర జిల్లాల నుండి వచ్చి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల టెండర్లు వేసుకొని కొన్ని ప్రభుత్వ శాఖలు అనగా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వసతి గృహాలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తి చేస్తున్నారని అన్నారు, ఎలాంటి నోటిఫికేషన్ పత్రిక ప్రకటన లేకుండా ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులను కుమురం భీం జిల్లాలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, దానితో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు నష్టపోతున్నారని అన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఉపాధి కల్పన అధికారి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు చెప్పినట్లుగాను అధికారి పని ఉంది. జిల్లాలో ఉన్న యువతకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెలిసి జిల్లాలో ఉన్న యువతకు న్యాయం చేయాలి, నామమాత్ర పత్రిక ప్రకటనలు ఇవ్వడం కాకుండా జిల్లాలో ఉన్న అర్హత కలిగిన యువతకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అభ్యర్థుల వద్ద పైసలు వసూలు చేసే పద్ధతి మార్చుకోవాలని అర్హులైన జిల్లా వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.లేని పక్షంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లు జిల్లా వాసులకే ఇవ్వాలని జిల్లా అధికారులను కోరారు ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లు ఒకరికి రెండు మూడు ఉన్నాయి, అవి వారి కొడుకుల మీద మరియు వారి బందువుల పేరు మీద నడుస్తున్నాయి.ఎలాంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లు క్యాన్సల్ చేయాలని వారు డిమాండ్ చేశారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు అలాంటి ఏజెన్సీలను అధికారులు గుర్తించి వారి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేయాలని కోరారు, కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ నాయకులు జాడి తిరుపతి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking