భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాబ్ మేళా విజయవంతం
-780 మంది హాజరు కాగా 489 మంది ఏంపిక
భద్రాద్రి/ అక్షిత బ్యూరో :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనాధికారిణి విజేత వేల్పుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.ఎల్ అండ్ టి కంపెనీ వారు ఐటిఐ ఎలక్ట్రిషీయన్ పిట్టర్ వెల్డర్ సివీల్ కోర్స్ లు పూర్తి చేసిన 780 మంది అభ్యర్దులు హాజరు కాగా ఇంటర్వూలు నిర్వహించి 489 మందికి ఉద్యోగవకాశాలు కల్పించారు.వీరికి అప్పటికప్పుడే నియామక పత్రాలను జిలా ఉపాధికల్పనాధికారిణి విజేత వేల్పుల ప్రభుత్న ఐటిఐ కళశాల ప్రిన్సిపాల్ జీ రమేష్ సంయుక్తంగా
అందచేశారు.

ఈ జాబ్ మేళాలో యువకులకు టెక్నీషియన్ మహిళలకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ లో నిమాయకాలు చేశారు.వీరికీ చెన్నైలో 3 నెలల ఆన్ గోయింగ్ ట్రైనింగే ఇస్తారు.ఈ ట్రైనింగ్ లో భోజన వసతులు ఉచితం. తదుపరి వీరికి హైద్రాబాద్ వరంగలో విజయవాడ రీజియన్ లకు సంబందించిన పట్టణాలలో వారికీ నియామకం చేస్తారని జిల్లా ఉపాధి కల్పనాధికారిణీ వెల్పుల విజేత తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటీఐ సిబ్బంది చంద్రమోహన్ శోబన్ బాబు బుచ్చిబాబు తదితురులు పాల్గోన్నారు.