ప్రజా ప్రతినిధుల పేరు చెప్పుకుంటూ అనుచర గణం అక్రమ నిర్మాణాలు.. 

ప్రజా ప్రతినిధుల పేరు చెప్పుకుంటూ అనుచర గణం అక్రమ నిర్మాణాలు.. 

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వర కాలని, రాఘవేంద్ర కాలనీలలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేరు చెప్పుకుంటూ విచ్చల విడిగాఅక్రమ నిర్మాణాలు చేపడుతూ అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ అక్రమంగా అదనపు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్న ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది దీపక్ అనే రాజకీయ నాయకుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అంతస్తుల భవనాలు నిర్మిస్తు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. జి హెచ్ ఎం సి అధికారుల ను సైతం వారి ఆదేశాల ను భేఖాతరుచేస్తూ అక్రమ నిర్మాణ దారుల వద్ద సొమ్ములు తీసుకుని పబ్బం గడుపుతున్న ఈ నాయకుడి తీరు వివాదాస్పదం అవుతూ వస్తుంది. ఒక పక్క ప్రభుత్వం పట్టణ ప్రణాళిక విభాగం కి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని బిల్డింగ్ లు సీజ్ చేయాలని ఆశిస్తూ చర్యల కి ఉపక్రమిస్తుంటే పిర్యాదులు చేసిన సదరు దీపక్ సంబంధించిన మూడు బిల్డింగు లపై చర్యలు తీసుకోవడం లేదని పౌరసమాజం ప్రశ్నిస్తుంది. 50 మంది నివాసం ఉండే బిల్డింగ్ లో అదనపు అంతస్తుల నిర్మాణం చేసి వందలాది మందికి నివాసం కల్పించి డ్రైనేజ్, వాటర్, ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు తలెత్తేలా చేస్తున్న అక్రమార్కుల కి కళ్ళెం వేసేలా ఇప్పటి కైనా అక్రమ నిర్మాణాల జి హెచ్ ఎం సి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking