ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల నిరుద్యోగుల పొట్టకొడుతున్నారనే ఆరోపణలు

ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల నిరుద్యోగుల పొట్టకొడుతున్నారనే ఆరోపణలు

నాలుగో రోజుకు చేరిన నిరాహార దీక్ష

దీక్ష కు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

 కల్వకుర్తి అక్షిత ప్రతినిధి 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపులో జరిగిన అక్రమాలను నిరసిస్తూ నిరుద్యోగ దళిత యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం (నాలుగో రోజు) కొనసాగాయి. దుకాణాలను అనర్హుల పేరున కేటాయించి రిఫండ్ చేస్తున్నారని, అనర్హులకు షట్టర్లు కట్టబెట్టారని నిరాహార కార్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.దీక్షా శిబిరానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు విజితా రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు తమ అనుచరులతో చేరి ఆందోళనకారుల బాధ్యతతో సంఘీభావం తెలియజేశారు. జైపాల్ యాదవ్ ప్రభుత్వం, స్థానిక అధికారుల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, పట్టణ నడిబొడ్డున నిరుద్యోగ దళిత యువత తమ న్యాయ హక్కుల కోసం శాంతియుత నిరసనలు నిర్వహిస్తున్నప్పుడే అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈక్రమం ప్రభుత్వం ఎంత నిద్రలో ఉందో సూచించే ఉదాహరణగా ఉందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ మాజీ జెడ్పిటిసి విజితా రెడ్డి.బిఆర్ఎస్ పార్టీ మండల లింగం కిషోర్ బాల్ రాజ్ నరేష్ దీక్ష నిర్వహిస్తున్న మల్లేష్ పంబాల సుధాకర్ మాల మహానాడు మాదిగ కమ్యూనిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking