చెరుకూరి నివేదితకు లాప్ ట్యాప్ అందజేడం అభినందనీయం -పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు
చెరుకూరి నివేదితకు లాప్ ట్యాప్ అందజేడం అభినందనీయం
-పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎన్ఐటి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ నందు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న చెరుకూరు నివేదిత కు ఖమ్మం పట్టణానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు జానకి బోస్ చావా రమేష్ బాబు నాగండ్ల వెంకటేశ్వరరావు ఆళ్ల వెంకట్రావు కాంపాటి చలపతిరావు డాక్టర్ వైవిడి నాగేశ్వరరావు నున్నా సాత్విక్ కే సుధాకర్ రావు గుర్రం భాస్కరరావు వైవీ ల ఆర్థిక సహకారంతో నిన్న 40 వేల రూపాయలు విలువగల ల్యాప్ టాప్ ను రిక్కా బజారు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చెరుకూరి నివేదిత తల్లిదండ్రులకు అందించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెరుకూరి నివేదితకు అవసరమైన ల్యాప్ టాప్ ను అందజేయడం గొప్ప అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కొంగర పురుషోత్తం రావు మద్దినేని ప్రసాదరావు సిరిపురపు రమణారావు నాగేశ్వరరావు తాళ్లూరు గోపాలరావు సయ్యద్ షఫీ డాక్టర్ చావా సత్యప్రసాద్ పాల్గొన్నారు.అనంతరం నివేదిత తండ్రి సాంబమూర్తి మాట్లాడుతూ నివేదితకు ల్యాప్ టాప్ అవసరమని వైరా మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వెలిశెట్టి నరసింహారావు భాస్కరరావు గ తెలుపుగానే వెంటనే స్పందించి గొప్ప మనసుతో ఆర్థిక సహాయం అందించిన సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నివేదిత తల్లి తమ్ముడు పాల్గొన్నారు.నివేదిత స్వగ్రామము వైరా మండలం పుణ్యపురం నివేదిత తండ్రి సాంబమూర్తి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో నివేదితకు అవసరమైన ఆర్థిక సహాయం కొనసాగిస్తామని నివేదిత బాగా చదువుకొని ఖమ్మం జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.