పచ్చదనం పరిశుభ్రత పాటిస్తున్న రామకృష్ణ వీధి అసోసియేషన్.

పచ్చదనం పరిశుభ్రత పాటిస్తున్న రామకృష్ణ వీధి అసోసియేషన్.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
పరిశుద్ధతే లక్ష్యంగా పనిచేస్తానని వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధి అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి, గాందీ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుల ఆదేశాల మేరకు స్పందించిన అధికారులు కాలనీలో ఎంతోకాలంగా నిలిచిపోయిన చెత్తను అదేవిధంగా కాలనీలో గల పురాతన కరెంటు స్తంభాలు విరిగిపడేలా ఉంటే దానిని తొలగించడం జరిగింది. అదేవిధంగా పురాతన కరెంటు తీగలు తీసేయించి నూతన తీగలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రోజా దేవి రంగారావు సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో కాలనీకి మరెన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చెంగల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking