ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
మరిపెడ అక్షిత ప్రతినిధి:-
మరిపెడ మున్సిపాలిటీలోని సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డి ఎస్ వి ఎన్ మాధురి అధ్యక్షతన పాఠశాల నుండి మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డి. శ్రీశైలం ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలను కొనియాడారు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఎంతో కష్టపడి ప్రైవేట్ గా ఉద్యోగాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు కృషి చేసి, ప్రభుత్వ ఉద్యోగం సాధించారని, ఎంతో సమాజ సేవ చేశారని, కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు తిండికి లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే దాతల ద్వారా 60 మంది ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి అరక్వింట బియ్యం చొప్పున అందజేశారు. పాఠశాల గ్రంథాలయానికి వెయ్యి రూపాయల విలువ చేసే పుస్తకాలను స్వయంగా ఇచ్చారు. 5000 రూపాయల విలువచేసే పుస్తకాలను దాతల ద్వారా సేకరించారు. పదవ తరగతిలో ఉత్తమ గ్రేడ్ లు సాధించిన విద్యార్థులకు 5000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీశైలం మాట్లాడుతూ పిల్లలు చదవడం, రాయడం అభివృద్ధి చేసుకోవడం ద్వారా అన్ని సబ్జెక్టులలో జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారని చెప్పారు. పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు. .ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రామ్మోహన్ బయగాని, స్టాఫ్ సెక్రటరీ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఇందిరా, ఫిరోజ్ ఖాన్, నగేష్, శౌరి, నిర్మల, మేరిశీలా, ప్రసాదరావు, శంకర్, ప్రేమ్ సాగర్, హరి, మధుకర్ రాజకుమారి వెంకన్న సురేష్, ఉమాదేవి, హరినాథ్ బాబు, భద్ర, వెన్నెల మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking