*జన జాతరను తలపించిన ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గూడ కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర *భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యఅతిథిగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి .

*జన జాతరను తలపించిన ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గూడ కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర

*భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

ముఖ్యఅతిథిగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి .

రంగారెడ్డి అక్షిత ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గూడ గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాడవాడలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామపంచాయతీ ముందు ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షలు , ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలెండర్ రూ. 500 కే , ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి , ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్ మెంట్, ప్రతి మహిళకు పావలవడ్డి కే రుణాలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పెన్షన్ లు అందిస్తామని తెలియజేసారు. ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తున్న బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు భూపతిగళ్ల మహిపాల్, చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, గురునాథ్ రెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, కొత్తకూర్మ మంగమ్మ – శివకుమార్, కంబాలపల్లి హన్మంత్ రెడ్డీ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి, మంకాల దాసు, స్థానిక ఎంపిటిసి ఆంజనేయులు, ఉపసర్పంచ్ నరేందర్, అధ్యక్షుడు శ్రీరాములు, భిక్షపతి తో పాటు జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking