ఘనంగా ఇఫ్తార్ విందు.
ఎల్లమ్మబండలో పండగ వాతావరణం.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ముస్లిం, హిందూ, క్రైస్తువల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వి.వి వి. ఎస్.ఎన్ చౌదరి అన్నారు.సోమవారం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్, ఎల్లమ్మబండ కూడలి వద్ద ఉన్న గరీబ్ నవాజ్ మసీదు ప్రాంగణంలో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నాయకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు, దాదాపు 2500 మంది విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిదులుగా వి.వి వి. ఎస్.ఎన్ చౌదరి హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదరులకు పండ్లు ఇచ్చి ఉపవాసం విడిపించారు. అనంతరం సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమమని ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ షేక్ స్యాయీద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను, ముస్లిం మత పెద్దలను సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతూ.. నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు అరుణ, యూత్ కాంగ్రెస్ సూర్యవంశీ ప్రదీప్, కిరణ్, కనీఫ్ బేగం తదితరులు పాల్గొన్నారు.