అక్రమ కట్టడాలు కూల్చివేతలు..
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలో బుధవారం. బహదూర్ పల్లి సర్వేనెంబర్ 131 లో ప్రభుత్వ స్థలంలో బేస్మెంటు కాంపౌండ్ వాల్ సిమెంట్ పలకలతో నిర్మాణం జరిగిందని స్థానికులు తాసిల్దార్ పద్మప్రియ కు సమాచారం. చేరవేగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి పరిశీలన చేసి చర్యలు చేపట్టాలని తెలియజేయగా వెంటనే తాసిల్దార్ ఆదేశాల మేరకు వీఆర్ఏలు జెసిబి సాయంతో బిస్మెంటు కాంపౌండ్ వాల్ సిమెంట్ పలకలతో నిర్మాణం. కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా సహించేది లేదు చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం.అని హెచ్చరించారు. స్థానిక వీఆర్ఏ కిష్టయ్య పాల్గొన్నారు.