కార్మికుల కు కనీస వేతనాలు ఇవ్వాలి అని అపర్ణ సరోవర్ కార్మికుల ధర్నా సి.ఐ. టి. యు డిమాండ్

కార్మికుల కు కనీస వేతనాలు ఇవ్వాలి అని అపర్ణ సరోవర్ కార్మికుల ధర్నా సి.ఐ. టి. యు డిమాండ్

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: పరిధిలో నల్లగండ్ల లోని అపర్ణ సరోవర్ హౌస్ కీపింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ ఫైర్ సెక్యూరిటీ కార్పెంటర్ మేస్త్రి మొదలగు సుమారుగా 150 మంది విధులు నిర్వహిస్తున్నారు బి. వి. జి. కంపెనీలో వీరూ నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచాలని అడగ్గానే ఇష్టానుసారంగా బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం జరిగింది దీనికిగాను సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ స్కిల్ వర్కర్ గా పని చేస్తున్నటువంటి వీళ్ళందరికీ సుమారుగా 15000 ఇవ్వాలి కానీ 11,500 రూపాయలు ఇచ్చి బి.వి.జి కంపెనీ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా మానసికంగా శారీరకంగా వేదింపులకీ గురి చేస్తున్నారు. కనీసవేతనాలు పెంచేవరకు విధులు బహిష్కరిస్తామని అపర్ణ సరోవర్ ముందర గేటు ముందర ధర్నాకు దిగారు కార్మికులందరికీ న్యాయం చేసేంతవరకు పోరాడుతామని కార్మికులు ముక్తకంఠంతో అన్నారు. న్యాయపరమైన వేతనం వెంటనే కార్మికుల కి పెంచాలి పెంచే వరకు సి.ఐ.టి.యు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం పోరాటం చేస్తుంది అని ఈ సందర్భంగా ఆయన అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking