ఓటర్ జాబితాలో తొలగింపులు సరిగ్గా నిర్వహించాలి
మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గతంలో ఓటర్ జాబితాలో తొలగింపులు సరిగ్గా నిర్వహించాలని చెన్నూరు ఎన్నికల అధికారి రాములు నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలలో బిఎల్ఓ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో తొలగింపులు సరిగ్గా చేశారా, డూప్లికేట్ ఓటర్ పేర్లు తొలగించారా, ఫోటో సిమిలర్ ఎంట్రీస్ సరిగా గుర్తించారా, లేదో అని తదితర వాటిని పరిశీలన చేసి, సంబంధిత ఫారాలు బిఎల్ఓ లు సేకరించి, వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సంపతి శ్రీనివాస్, చెన్నూరు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్ రావు, మందమర్రి క్యాతనపల్లి లకు చెందిన బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.