శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి

ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:-

మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించడంలో, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో శ్రీ చైతన్య విద్యాసంస్థ ముందు ఉంటుందని, అందులో భాగంగానే
నర్సరీ నుంచి యూకేజీ వరకు విద్యను పూర్తి చేసుకోని ఒకటవ తరగతి లోనికి వెళ్తున్న సందర్భంగా విద్యార్థిని, విద్యార్థునులను చిన్నతనంలోనే వారిని ప్రోత్సహించడం కోసం, విద్యార్థులకు పట్టాలను బహుకరించి పిల్లలు ఇంకా చదువు పై ఆసక్తి చూపేందుకు పాఠశాలలో స్నాతకోత్సవం ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి వచ్చి ఈ కార్యక్రమంను విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నాగేశ్వరరావు, సి బ్యాచ్ ఇంచార్జ్ రమేష్ బాబు, ప్రైమరీ ఇంచార్జి సునీత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking